Show notes
సృష్టి సిద్ధాంతం — ఒక పరిచయం
మనం జీవిస్తున్న ఈ లోకం ఎలా వచ్చింది? దేవుడు సమస్తాన్ని ఎందుకు సృష్టించాడు? మన జీవితానికి ఉద్దేశం ఏమిటి?
ఈ మొదటి ఎపిసోడ్లో సృష్టి సిద్ధాంతం (Doctrine of Creation) అంటే ఏమిటి, దాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి అనే విషయాలను దేవుని వాక్యం ఆధారంగా పరిశీలిస్తాం.
ఈ ఎపిసోడ్లో తెలుసుకునే విషయాలు
- దేవుడే సమస్తానికి సృష్టికర్త. ఆయనకు ఆరంభం లేదు, అంతం లేదు.
- దేవుడు తన సృష్టిపై ఆధారపడడు. కానీ సమస్త సృష్టి ఆయనపై ఆధారపడి ఉంది.
- మనిషి దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. అందుకే ప్రతి మనిషికి విలువ, గౌరవం ఉన్నాయి.
- దేవుడు తన మహిమ కొరకు సమస్తాన్ని సృష్టించాడు.
- పాపం వల్ల సృష్టిపై వచ్చిన ప్రభావం, ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ గురించి కూడా పరిచయం చేసుకుంటాం.
ముఖ్యమైన బైబిలు వాక్యభాగాలు
— దేవుడే సమస్తానికి సృష్టికర్త.
— దేవుడు నిత్యుడు.
— మనిషి దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు.
ఆదికాండము 3 — పాపం లోకంలోకి రావడం.
— సమస్తమూ దేవుని చిత్తానుసారంగా సృష్టించబడ్డాయి.
ఆలోచించండి
దేవుడే నన్ను సృష్టించాడని నేను నమ్ముతున్నాను. అయితే ఆ సత్యం నా జీవితంలో ఎంతవరకు కనిపిస్తోంది?
మన నిర్ణయాల్లో, కుటుంబ జీవితంలో, ఇతరులతో మన సంబంధాల్లో దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో ఆలోచిద్దాం.
తదుపరి ఎపిసోడ్
దేవుడు సమస్తాన్ని శూన్యం నుండి సృష్టించాడు
దేవుడు ముందుగా ఉన్న పదార్థాలను ఉపయోగించకుండా సమస్తాన్ని ఎలా సృష్టించాడు? దీని గురించి బైబిలు ఏమి బోధిస్తుంది?
Life & Scripture
దేవుని వాక్య వెలుగులో మన జీవితాన్ని అర్థం చేసుకుందాం.



