క్రీస్తు ప్రాయశ్చిత్తం గురించి తెలుసుకోవలసిన 5 విషయాలు
ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి? ప్రాయశ్చిత్తానికి కారణం ఏమిటి?
1. ప్రాయశ్చిత్తం అంటే ఏమిటి?
క్రీస్తు తన జీవితం మరియు మరణం ద్వారా మన రక్షణను సంపాదించేందుకు చేసిన పనిని ప్రాయశ్చిత్తం అంటాము.
2. ప్రాయశ్చిత్తానికి కారణం ఏమిటి?
క్రీస్తు ఈ లోకానికి వచ్చి మన పాపాల కోసం చనిపోవడానికి దారితీసిన అంతిమ కారణం ఏమిటి? మనం ఈ ప్రశ్నకు జవాబును దేవుని స్వభావంలోనే వెదకి తెలుసుకోవాలి.
వాక్యం దానికి దేవుని ప్రేమ, మరియు ఆయన న్యాయమనే సమాధానాలను ఇస్తుంది.
దేవుని ప్రేమ ప్రాయశ్చిత్తానికి ఒక కారణమని వివరించడానికి వాక్యం యోహాను 3:16 ను చూపిస్తుంది.
ఇది మనకి బాగా తెలిసిన వాక్య భాగమే; దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఆయనను అనుగ్రహించెను.
క్రీస్తు లోకానికి వచ్చిచనిపోడానికి ఒక కారణం అయన ప్రేమ. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి, మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుని పంపెను; ఇందులో ప్రేమయున్నది. 1 యోహాను 4:10.
రెండవది, అయన న్యాయమంతుడు కనుక, మన పాప జీవితము ద్వారా మనం కూడబెట్టుకున్న పాపానికి వెల చెల్లించే మార్గాన్ని కూడా అయనే మనకోసం తెరచాడు. ఈ మార్గము ద్వారా తన న్యాయమైన ఉగ్రతనకు క్రీస్తు మరణం ద్వారా పరిహారము లభించింది. అందువల్ల దేవుని ప్రేమ మరియు ఆయన న్యాయం రెండూ కూడా ప్రాయశ్చిత్తానికి అంతిమ కారణాలు.
3. ప్రాయశ్చిత్తం యొక్క అవసరత ఏమిటి?
మన స్థానంలో చనిపోవడానికి తన కుమారుడిని పంపించడం కాకుండా మానవాళిని రక్షించడానికి దేవునికి వేరే మార్గం ఉందా? ఈ ప్రశ్నకు సమాధానమిచ్చే ముందు, దేవునికి ఏ జనాన్ని కూడా రక్షించాల్సిన అవసరం లేదనేది మనం గ్రహించడం చాలా ముఖ్యం.
దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. 2 పేతురు 2:4.
ఈ వాక్యము ఆధారంగా చూసుకుంటే , దేవుడు పాపులమైన మనలను కూడా న్యాయంగా, దేవదూతలను ఏవిధంగా ఐతే రక్షించకూడదని నిర్ణయించుకున్నాడో , అలాగే మనుషుల్లో ఎవరునీ కూశా రక్షించకుండా శిక్షవిధించియుండవచ్చు.
కాబట్టి ఈ కోణంలో మనం ఆలోచిస్తే నిజానికి ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా అవసరం లేదు.
దేవుడు , తన ప్రేమలో, కొంతమంది మనుషులని రక్షించాలని నిర్ణయించుకున్నాడు, దేవుని కుమారుని మరణం ద్వారానే తప్ప వేరే ఏ మార్గమూ లేదని లేఖనంలోని అనేక భాగాలు సూచిస్తున్నాయి.
అందువల్ల, ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా అవసరం లేదు, కానీ కొంతమంది మనుషులను రక్షించాలనే దేవుని నిర్ణయం యొక్క 'పర్యవసానంగా' ప్రాయశ్చిత్తం ఖచ్చితంగా అవసరం.
4. క్రీస్తు ఎవరి కోసం ప్రాయశ్చిత్తుడయ్యాడు ?
క్రీస్తు సిలువపై మరణించినప్పుడు, తాను మానవ జాతి ప్రతి ఒక్కరి పాపాలకు వెల చెల్లించాడా లేక చివరికి రక్షింపబడతాడని తనకు తెలిసిన వారి పాపాలకు మాత్రమే చెల్లించాడా?
Reformed వేదాంతవేత్తలు మరియు ఇతర కాథలిక్ మరియు ప్రొటెస్టంట్ వేదాంతవేత్తల మధ్య వ్యత్యాసాలలో ఒకటి, క్రీస్తు ప్రాయశ్చిత్తం ఎవరికోసం చేసాడు అన్నది.
ఈ అంశం గురించి బోధించే సిద్ధాంతాన్ని, రెఫార్మేడ్ దైవశాస్త్రం (Reformed Theology) లో లిమిటెడ్ ఆటోన్మెంట్ (Limited Atonement or particular Redemption) అంటారు. ఈ సిద్ధాంతం వాక్యానికి దగ్గరగా ,స్థిరమైనది గా ఉందని మనకి అర్థం ఔతుంది.
క్రీస్తు సిలువలో లోకంలో ఉన్న ప్రతి మనిషి కొరకు తన రక్తం కార్చలేదనడానికి, తనను విశ్వసించిన మరియా విశ్వసించబోవు వారి కోసమే చనిపోయాడు అనడానికి వాక్యానుసారమైన ఆధారాలు చాలా ఉన్నాయి.