క్రైస్తవులు మరియు కాథలిక్కులు కొన్ని స్వల్ప విషయాలలో తప్ప అన్ని విషయాలను ఒకేలా నమ్ముతారని ఒక అభిప్రాయం.ఉదాహరణకు కాథలిక్స్ యేసు మరియు మరియను ఆరాధిస్తారని క్రైస్తవులు యేసుని మాత్రమే ఆరాధిస్తారని అందరు అనుకుంటారు .కాని, నిజానికి వీరిరువురి మధ్య భేదాలు ఉన్నాయి . అవి ఏమిటో క్రైస్తవులైన మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఈ భేదాలు మనం తెలుసుకుంటే క్రీస్తుని గూర్చిన వార్త వారికి ప్రకటించేటప్పుడు మనకు సహాయ పడవచ్చేమో ఎవరికీ తెలుసు? కనుక వాటిని గూర్చి తెలుసుకుందాము.
1. పోప్ సంఘానికి శిరస్సు
యేసు, పేతురు ( ఈ పేరుకి అర్దం రాయి)అనబడు సీమోను ని సంఘానికి "రాయి"గ చేసాడని, పరలోక తాలపుచెవులు ఇచ్చాడని, సంఘమంతటికి కాపరి గా నియమించ్చాడని కాథలిక్కుల ప్రగాడ విశ్వాసం. ప్రస్థుతం పేతురు మరియు అపొస్తలుల కాపరిత్వాన్ని బిషప్పులు పోప్ యొక్క అధికారం క్రింద కొనసాగిస్తున్నారు.ఈ అభిప్రాయానికి మూలము Matthew 16:18-19. ఈ ఒక్క వచనాలని నేను చదివినప్పుడు వారు నమ్మింది నిజమే అనుకున్నాను.దానిని సందర్భం తెలియకుండ చదివిన ఎవరికైనా అలాగె అనిపిస్తుంది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే ఈ అభిప్రాయాలని లేఖనములు ఏకీభవిస్తున్నాయా? ఈ ప్రశ్నకు జవాబు Acts 15:1-23, Galatians 2:1–14 లో పరిశీలిస్తే కనిపిస్తుంది. అపొస్తలులు అందరూ క్రీస్తు ఇచ్చిన అధికారంతో సమానంగా సువార్త పరిచర్యలో పాలుపంపులు చేసారని తెలుస్తున్నది. 1 Peter 5:1–5 "తోటిపెద్దను, క్రీస్తు శ్రమలనుగూర్చిన సాక్షిని, బయలుపరచబడబోవు మహిమలో పాలివాడనునైన నేను మీలోని పెద్దలను హెచ్చరించుచున్నాను" అని రాశాడు. ఆయన తనను ముఖ్యునిగా కాకుండ మిగిలిన వారితో పాటు తోటి పెద్దగా భావిస్తారు.ప్రారంభంలో పేతురు సువార్త వ్యాప్తిలో ముఖ్యునిగా ఉండినను సందర్భొచితంగ గమనిస్తె ఇతర అపొస్తలులపై లేదా చర్చిపై అతను సర్వాధికారం కలిగి ఉన్నాడని మనకి ఎక్కడా చెప్పబడదు.
2. కాథలిక్కులు తల్లియైన మరియను ఆరాధించడం
దేవునికి మాత్రమే ఆరాధన చెల్లించాలని ,ఆయన ఆరాధనకు పాత్రుడు అని కాథలిక్కులు విశ్వసిస్థారు. కాని వారు మరియను కూడ ఆరాధిస్తారు.ఒక్కమాటలో చెప్పాలంటె ఆమె దేవుని తల్లి అని గొప్ప భక్తి శ్రధలతో గౌరవిస్తారు. మదర్ థెరీసా ఒకసారి జీవాహారమైన క్రీస్తు ను పొందుటకు స్వఛ్చమైన హృదయాన్ని ఇవ్వమని మేరి ని వేడుకున్నది అని కాథలిక్ మూలాలు చెపుతున్నాయి.ఈ రకమైన ప్రార్థన గురించి బైబిల్ ఏమి చెప్తుంది? బైబిల్ లో ఇటువంటి ప్రార్థనలు ఎవ్వరు ఎప్పుడూ ప్రస్తావించడం కాని ప్రోత్సాహించడం కాని జరగలేదు. కాథలిక్కులు యేసు యొక్క ప్రధానయాజకత్వాన్ని మేరికి ఆపాదిస్తునారు.మరియమ్మకు కలిగిన హృదయము, దీనత్వాన్ని కోరుటలో తప్పు ఏమీ లేదు, కానీ యేసు ద్వారా కాక ఆమెకు ప్రార్థించుట దేవుని పట్ల అపరాధం.
1 Tim 2:5 లో "దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు" అని రాయబడి ఉంది. పరిశుద్ధులకు ప్రార్థించడం లేఖనములకు విరుద్దం, ఎందుకంటే మనం వారిని దేవునికి మరియు మనుషులకు మధ్యవర్తులను చేస్తు యేసుక్రీస్తు యొక్క ఏకైక మధ్యవర్తిత్వాన్ని క్షీణంపచెస్తున్నాము. యేసుక్రీస్తు యొక్క ఆధిపత్యం, ప్రత్యేకంగ అయన చేసిన పరిపూర్ణ బలి ప్రభావము గూర్చి మరియు తండ్రి కుడిపార్శ్వమున కుర్చొని తనికి అనుగ్రహించబడిన ప్రజల కోసము విజ్ఞాపన గూర్చి హెబ్రీ పత్రికలో అంతట చూస్తాము.ఇంకా చెప్పాలంటే మన ప్రార్ధనలు కూడ యేసు నామము లోనే కదా తండ్రి దగ్గరకు తెస్తాము. ఆలోచించండి. ఆరాధన దేవునికి మాత్రమే చెందాలి అన్నప్పుడు అది యేసుక్రీస్తు ద్వారానే. ఇది వాక్యానుసారం.