
ప్రేమికుల రోజుకు చీకటి చరిత్ర ఉంది. పురాతన రోము లో ఇది అన్యులు ఆచరించే భూసార పండుగ అని చరిత్రకారులు విశ్వసించారు. జంతుబలులు మరియు ఇతర క్రూరమైన ఆచారాలతో వ్యవసాయ దేవుడైన ఫానస్కుకు , బలులు అర్పించేవారు.
క్రీస్తుశకం 270 లో సంభవించిన వాలెంటైన్స్ మరణం లేదా ఖననం యొక్క వార్షికోత్సవం సందర్భంగా ఫిబ్రవరి నెల మధ్యలో ప్రేమికుల రోజు జరుపుకుంటారని కొందరి అభిప్రాయం , ఈ సంప్రదాయం కొనసాగుతూ భారతదేశంతో సహా వివిధ ఖండాలకు వ్యాపించింది. కొంతమందికి, ఇది సంతోషాన్ని మరియు విలాసాన్ని కలిగిస్తే , మరికొందరికి తమ ప్రియులను కోల్పోయిన వారై వారితో కలిసి ఈ రోజుని సంతోషంగా గడపలేక పోతున్నందుకు బాధ!
మొదటి శతాబ్దంలో, రోమా సామ్రాజ్యాధిపత్యం కొనసాగుతున్న రోజుల్లో ఒక వ్యక్తి నివసించేవాడు. అతను బీదలను ప్రేమించి నమ్మకాన్ని కలిగించాడు. ().రోగులను ప్రేమించి వారిని స్వస్థపరచాడు (, ); వితంతువులను ఆదరించాడు (); పిల్లలను ప్రేమించాడు (), తనను ద్వేషించిన వారిని ప్రేమించాడు (), అయినప్పటికీ అతను నేరస్థుడిలా మరణించాడు. అయన పేరే యేసు క్రీస్తు . అతను చేసిననేరం ప్రేమించుటయే.
దేవుడు ప్రేమ గనుక మనలను ప్రేమించెను కానీ, మనము ప్రేమించదగిన వారమని ప్రేమించలేదు.
యేసు కేవలం వాలెంటైన్ లాంటి మనిషి మాత్రమే కాదుకానీ , సజీవుడైన దేవుని కుమారుడు.(; ).
రాబోయే ఉగ్రత నుండి పాపులను రక్షించుటకు దేవుడు , క్రీస్తుని ఈ లోకానికి పంపించాడని బైబిల్ చెప్తుంది(, ). దేవుడు ఈలాగు తన ప్రేమను వెల్లడి చేస్తున్నాడు. ఎవరు నశించట ఆయనకు ఇష్టం లేదు. పాపము చేత దేవునికి విరోధులుగా అయిన మనలను, ప్రేమించి , మనకి రావలసిన ఆ మరణ శిక్షను తనపై వేసుకొని, మనకు అయన నీతిని ఆపాదించి స్నేహితుడయ్యాడు, మన స్థానంలో మరణించాడు (, ,).
పాపము చేత విరోధులమై ఉండగా క్రీస్తు మనకొరకు చనిపోయెనని నిజంగా గ్రహించినప్పుడే ఈ ప్రేమను మనము అర్ధం చేసుకోగలం.( ). అయన ప్రేమ గనుక మనలను ప్రేమించెను కానీ, మనము ప్రేమించదగిన వారమని ప్రేమించలేదు. దేవుడు మనలను తన నిత్య ప్రేమతో ప్రేమించి తన రాజ్యమునకు వారసులుగా చేయుటకు మనలను ఎంచుకొనెను().
గనుక, మనము దేవుని ప్రేమను రుచిచూచిన వారముగా ఒకనినొకడు ప్రేమింప బద్ధులమై ఉన్నాము. ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడు ()


