
ఆయనొక ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన క్రీడాకారుడు. ఒలింపిక్స్ లో అమెరికా జట్టు తరపున రెండు సార్లు స్వర్ణం సాధించి ఎన్బీఐ చరిత్రలో అత్యధిక స్కోర్ చేసిన క్రీడాకారుల్లో నాల్గో వ్యక్తిగా రికార్డులు సృష్టించారు. కోట్ల రూపాయల ఆస్తి గల సంపన్నుడు. ఆ వ్యక్తి పేరు కోబ్ బ్రయాంట్.
బాస్కెట్ బాల్ ఆటలో ఎన్నో అవార్డులు ఆయన సొంతం.ప్రపంచం ఆయన్నొక సూపర్ స్టార్ గా చూసింది. 2016లో బాస్కెట్ బాల్ క్రీడకు గుడ్ బై చెప్పిన తర్వాత వ్యాపారం, ఎంటైర్టైన్మెంట్ రంగాలపై బ్రయాంట్ దృష్టి సారించారు. ఫోర్బ్స్ లెక్కల ప్రకారం బ్రయాంట్ రిటైర్ అయ్యేనాటికి ఆయన ఆదాయం సుమారు 77 కోట్ల డాలర్లు (రూ. 5,500 కోట్లు).డబ్బుకు ఏ మాత్రం కొదవలేని వ్యక్తి. 2018లో డియర్ బాస్కెట్ బాల్ పేరిట ఆయన తీసిన షార్ట్ ఫిల్మ్ ఆస్కార్ అవార్డును అందుకుంది.పేరు ప్రఖ్యాతలకు కూడా కొదువలేదు. కానీ అకస్మాత్తుగా తన రెండో కూతురు ఇతర బృందంతో ప్రయాణిస్తుండగా హెలికాప్టర్ కొండను ఢీకొనడం వలన మృతి చెందాడు.ఎవ్వరూ ప్రాణాలతో బయటపడలేదు.
మరణం
ఎప్పుడొస్తుందో తెలియదు. ఎలా పలకరిస్తుందో తెలియదు. పేద, ధనిక తేడా లేదు. కుల మత బేధాలు లేవు. అకస్మాత్తుగా హరించి వేస్తుంది. ఎంత డబ్బున్నా, ఎంతో పేరు సంపాదించుకున్నా ఎన్నెన్నో మంచి పనులు చేసినా ఒక క్షణాన మృత్యువు ఒడికి చేరాల్సిందే.
కొంతమంది ఇష్టపడకపోయినప్పటికీ నేను ఈ విధంగా చెప్పాలనుకుంటున్నాను, " ఈ భూమ్మీద మనం జరుపుకునే ప్రతి పుట్టినరోజు, మనలను మన మరణ దినానికి దగ్గరగా తీసుకెళ్తుంది". మనిషికి మరణం తప్పదని ఆ సత్యాన్ని ఒప్పుకోక తప్పదని నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను.
మరణం తర్వాత ?
జీవం లేని శరీరం మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ విడువబడగానే మన పేరు పెట్టి పిలవరు గాని, శవం అని పిలుస్తారు. అంటే ఆత్మను బట్టే మనిషికి విలువ అని అర్థమౌతుంది.
ప్రశ్నేమిటంటే, ఆత్మ ఎక్కడికి వెళుతుంది?


