
Daily devotion · Thursday, 29 October 2026
క్రీస్తుకంటే విలువైనది ఏదైనా ఉందా?
Scripture
మత్తయి 16:24–26“ఒకడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనినయెడల వానికేమి ప్రయోజనము?” — మత్తయి 16:26
Reflection
ఈ లోకంలో మనం సాధించాలనుకునే విషయాలు ఎన్నో ఉన్నాయి. మంచి ఉద్యోగం, డబ్బు, పేరు ప్రతిష్ఠలు, సుఖసంతోషాలతో కూడిన జీవితం. వీటికోసం ఎంతో కష్టపడతాం. కానీ వీటన్నిటికంటే విలువైనది ఏమిటో ఎప్పుడైనా ఆలోచించామా?
మత్తయి 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు తాను శ్రమపడి, చంపబడి, తిరిగి లేవబోతున్నానని తన శిష్యులకు తెలియజేశాడు. ఆ తరువాత తనను వెంబడించాలనుకునేవారు తమను తాము ఉపేక్షించుకొని, తమ సిలువను ఎత్తుకొని తనను వెంబడించాలని చెప్పాడు.
తన్ను తాను ఉపేక్షించుకోవడం అంటే మన జీవితంపై మనకే అధికారం ఉందన్న భావనను విడిచిపెట్టి, క్రీస్తు ప్రభువు అధికారానికి లోబడడం. ఆయనకు విధేయులుగా జీవించడానికి శ్రమలను, నష్టాలను ఎదుర్కోవడానికి కూడా సిద్ధపడడం.
ఇదే సత్యాన్ని అపొస్తలుడైన పౌలు తన జీవితంలో చూపించాడు. లో “నాకైతే బ్రదుకుట క్రీస్తే, చావుట లాభము” అని చెప్పాడు.
పౌలుకు క్రీస్తు తన జీవితంలో ఒక భాగం మాత్రమే కాదు. క్రీస్తే అతని జీవితానికి కేంద్రం. అందుకే లో తాను ఇక జీవించేవాడను కాను, క్రీస్తే తనయందు జీవిస్తున్నాడని చెప్పాడు.
ఇదే హృదయాన్ని పాత నిబంధనలో కూడా చూస్తాం. లో ఆసాపు, దేవుడు తప్ప పరలోకంలోనైనా భూమిమీదనైనా తనకు మరెవరూ లేరని, తన శరీరమూ హృదయమూ క్షీణించినా దేవుడే తన భాగమని ప్రకటించాడు.
ఈ వాక్యాలన్నీ మనకు ఒక ముఖ్యమైన సత్యాన్ని గుర్తుచేస్తున్నాయి. దేవుడు మనకు ఇచ్చే ఆశీర్వాదాలకంటే దేవుడే మనకు అత్యంత విలువైనవాడు.
మనం క్రీస్తును వెంబడించడం ద్వారా రక్షణను సంపాదించుకోము. దేవుని కృపచేత విశ్వాసం ద్వారానే రక్షించబడతాము (). అయితే ఆ రక్షించే కృప మన హృదయాలను కూడా మారుస్తుంది. మనకోసం తన ప్రాణాన్ని అర్పించిన యేసుక్రీస్తు ప్రభువును అన్నిటికంటే ఎక్కువగా ప్రేమిస్తూ జీవించేలా చేస్తుంది.
ఈ రోజు మన హృదయాన్ని పరిశీలించుకుందాం.
క్రీస్తును వెంబడించడానికి నేను దేనినైనా కోల్పోవాల్సి వస్తే, ఆయనను నమ్మకంగా వెంబడించడానికి సిద్ధంగా ఉన్నానా? నా జీవితంలో క్రీస్తుకంటే ఎక్కువ విలువ ఇస్తున్నది ఏదైనా ఉందా?
Prayer
పరలోకపు తండ్రీ, ఈ లోకంలోని తాత్కాలికమైన విషయాలకంటే నిన్నే ఎక్కువగా ప్రేమించే హృదయాన్ని నాకు అనుగ్రహించుము. నా సొంత కోరికలకంటే నీ చిత్తానికి ప్రాధాన్యత ఇచ్చేలా నన్ను మార్చుము. ఎలాంటి పరిస్థితుల్లోనైనా యేసుక్రీస్తు ప్రభువును నమ్మకంగా వెంబడించడానికి నాకు కృపను దయచేయుము. ఆమేన్.