
Daily devotion · Monday, 9 November 2026
ఆందోళనలో ఉన్న హృదయానికి ఓదార్పు
Scripture
సామెతలు 12:25విచారం నిండిన హృదయం క్రుంగిపోతుంది. దయగల మంచి మాట హృదయానికి సంతోషం కలిగిస్తుంది.
Reflection
మన జీవితంలో కొన్నిసార్లు ఆందోళనలు మనల్ని ఎంతగానో కృంగదీస్తాయి. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, రేపు ఏం జరుగుతుందో అనే భయం మన మనసుకు భారంగా మారుతాయి. బయటికి మామూలుగానే కనిపించినా, లోపల ఎన్నో ఆందోళనలతో బాధపడుతుంటాం.
లో మనిషి హృదయంలోని ఆందోళన అతన్ని కృంగదీస్తుందని, అయితే మంచి మాట అతని హృదయానికి సంతోషాన్ని కలిగిస్తుందని సొలొమోను చెబుతున్నాడు.
ఇక్కడ మనం రెండు విషయాలను గమనించవచ్చు.
మొదటిది, ఆందోళన మన హృదయంపై చూపించే ప్రభావం. మన సమస్యల గురించి పదేపదే ఆలోచిస్తూ, రాబోయే రోజుల గురించి భయపడుతున్నప్పుడు మనం నిరుత్సాహానికి గురవుతాం. కొన్నిసార్లు ఆ భారం ఎంత ఎక్కువగా ఉంటుందంటే, సాధారణమైన పనులు చేయడం కూడా కష్టంగా అనిపిస్తుంది.
రెండవది, మంచి మాటకు ఉన్న ప్రాముఖ్యత. బాధలో ఉన్న వ్యక్తికి సరైన సమయంలో చెప్పే ప్రోత్సాహకరమైన మాట ఎంతో ఓదార్పునిస్తుంది.
అయితే మంచి మాట అంటే కేవలం “అంతా బాగైపోతుంది, బాధపడకు” అని చెప్పడం కాదు. అవతలి వ్యక్తి బాధను ఓపికగా విని, అతని పరిస్థితిని అర్థం చేసుకొని, ప్రేమతో, సత్యంతో మాట్లాడటం.
ముఖ్యంగా క్రైస్తవులమైన మనం ఇతరులను ప్రోత్సహించడానికి దేవుని వాక్యాన్ని ఉపయోగించాలి.
లో పౌలు మన ఆందోళనలను ప్రార్థనలో దేవునికి తెలియజేయాలని బోధిస్తున్నాడు. అలాగే లో నిరుత్సాహపడినవారిని ధైర్యపరచాలని చెబుతున్నాడు.
దేవుని వాక్యం మన సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయని వాగ్దానం చేయడం లేదు. కానీ మన కష్టాల మధ్య కూడా దేవునిపై ఆధారపడడానికి, ఆయన వాగ్దానాలను గుర్తుచేసుకోవడానికి సహాయం చేస్తుంది.
యేసుక్రీస్తు ప్రభువు కూడా లో ఈ లోకంలో మనకు శ్రమలు ఉంటాయని, అయితే ఆయనలో మనకు సమాధానం ఉందని చెప్పారు.
కాబట్టి మనం ఆందోళనలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని ఆశ్రయించాలి. మన బాధలను ప్రార్థనలో ఆయనకు తెలియజేయాలి. అవసరమైనప్పుడు సంఘంలోని విశ్వాసుల సహాయాన్ని కూడా పొందాలి.
అలాగే మన చుట్టూ ఆందోళనలో ఉన్నవారిని నిర్లక్ష్యం చేయకుండా, వారి బాధను ఓపికగా విని, ప్రేమతో ప్రోత్సహించాలి.
మన మాటలు ఇతరుల బాధను మరింత పెంచేవిగా కాకుండా, దేవుని సత్యాన్ని గుర్తుచేసి ఓదార్పునిచ్చేవిగా ఉండాలి.
Prayer
పరలోక తండ్రీ, మా జీవితంలో ఆందోళనలు, భయాలు ఎదురైనప్పుడు నీపై ఆధారపడడానికి సహాయం చేయుము. మా బాధలను నీకు తెలియజేస్తూ, నీ వాక్యంలో ఓదార్పును పొందేలా మమ్మల్ని నడిపించుము. అలాగే ఇతరుల బాధలను అర్థం చేసుకొని, సరైన సమయంలో ప్రేమతో, జ్ఞానంతో మాట్లాడే హృదయాన్ని మాకు అనుగ్రహించుము. మా మాటలు ఇతరులను ప్రోత్సహించేవిగా, నీకు మహిమ కలిగించేవిగా ఉండేలా సహాయం చేయుము. యేసుక్రీస్తు ప్రభువు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్.