క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన మనం Christians అయిపోతామా? అసలు Bible ప్రకారం Christian ఎవరు?
· 10 min
Show notes
క్రైస్తవుడు ఎవరు?
క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన మనం Christians అయిపోతామా? Churchకి వెళ్తూ, Bible చదువుతూ, ప్రార్థన చేస్తూ ఉంటే సరిపోతుందా? Bibleలో మొదటిసారిగా Christians అని పిలవబడిన అంతియొకయ విశ్వాసుల నుంచి, నికోదేముతో యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటల వరకు, Bible ప్రకారం నిజమైన Christian ఎవరో ఈ ఎపిసోడ్లో చూస్తాం.
ఈ ఎపిసోడ్లో:
Bibleలో మొదటిసారిగా Christians అని ఎవరిని పిలిచారు, ఎందుకు పిలిచారు?
అంతియొకయ విశ్వాసులు విశ్వసించిన సువార్త: క్రీస్తు మరణం, సమాధి, పునరుత్థానం
మనకు రక్షకుడు ఎందుకు అవసరం? మన మంచి పనులు మన పాపాలను ఎందుకు తీసివేయలేవు?
యేసుక్రీస్తు ప్రభువు గురించి తెలుసుకోవడానికి, ఆయనను విశ్వసించడానికి మధ్య తేడా
నికోదేము, కొత్త జన్మ
మారుమనస్సు, విశ్వాసం అంటే ఏంటి?
కృపచేత రక్షణ, మంచి పనుల స్థానం
నిజమైన Christian ఎవరు, ఇప్పుడు మనం ఏం చేయాలి?
లేఖన భాగాలు: అపొస్తలుల · · · :5 · ·
అధ్యాయాలు: 0:00 అసలు Christian ఎవరు? 0:50 Bibleలో మొదటిసారిగా Christians: అంతియొకయ 2:12 వాళ్లను Christians అని ఎందుకు పిలిచారు? 2:28 సువార్త: 2:53 యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు మరణించాల్సి వచ్చింది? 3:39 మంచి పనులు మన పాపాలను తీసివేయగలవా? 3:53 మనకు రక్షకుడు అవసరం 4:19 తెలుసుకోవడం వేరు, విశ్వసించడం వేరు 4:39 నికోదేము: కొత్త జన్మ 5:40 కొత్త జన్మ ఎలా వస్తుంది? 6:13 మారుమనస్సు, విశ్వాసం 6:51 కృపచేత రక్షణ, మంచి పనుల స్థానం 8:25 అసలు Christian ఎవరు? 9:04 మీకు ఒక ప్రశ్న
ఈ విషయాలు ఇంకా స్పష్టంగా అర్థం కాకపోతే, మీ Church Pastorతో గానీ, క్రీస్తును నిజంగా అనుసరిస్తున్న విశ్వాసితో గానీ మాట్లాడండి.
మరిన్ని ఎపిసోడ్ల కోసం Life and Scripture app (iPhone, Android) లేదా lifeandscripture.com చూడండి.
Read the transcript+
మనం Christians అని చెప్పుకుంటున్నాం కదా. కానీ ఎప్పుడైనా ఆలోచించారా? అసలు Bible ప్రకారం Christian ఎవరు? క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన మనం Christians అయిపోతామా? చిన్నప్పటి నుంచి Churchకి వెళ్తూ, Bible చదువుతూ, ప్రార్థన చేస్తూ ఉంటే సరిపోతుందా? లేక నిజమైన Christianగా ఉండడానికి ఇంకేదైనా అవసరమా? అసలు Bibleలో మొదటిసారిగా Christians అని ఎవరిని పిలిచారు? వాళ్లలో ఉన్న ప్రత్యేకత ఏంటి? మరి యేసుక్రీస్తు ప్రభువు గురించి తెలుసుకోవడానికి, ఆయనను నిజంగా విశ్వసించడానికి మధ్య తేడా ఏంటి? ఈ ప్రశ్నలకు Bible ఏం చెబుతుందో ఈ రోజు చూద్దాం.
More episodes
క్రైస్తవుడు ఎవరు? · Life and Scripture
Welcome to Life and Scripture Podcast.
ముందుగా అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయానికి వెళ్దాం. Bibleలో మొదటిసారిగా శిష్యులను Christians అని పిలిచింది అంతియొకయ అనే పట్టణంలోనే. అది అపొస్తలుల లో చదువుతాం.
కానీ వాళ్లు ఎవరు? వాళ్లను Christians అని ఎందుకు పిలిచారు? అది అర్థం కావాలంటే కొంచెం ముందు నుంచి చూడాలి.
స్తెఫను హతసాక్షి అయిన తర్వాత వచ్చిన హింస కారణంగా కొంతమంది విశ్వాసులు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లిపోయారు. వారిలో కొంతమంది అంతియొకయకు వచ్చారు. వాళ్లు అక్కడ యేసుక్రీస్తు ప్రభువు గురించి సువార్త ప్రకటించడం మొదలుపెట్టారు. అపొస్తలుల లో చాలామంది విశ్వసించి ప్రభువు వైపు తిరిగారని చదువుతాం. ఆ తర్వాత బర్నబా అక్కడికి వచ్చాడు. దేవుని కృపను చూసి సంతోషించాడు. చాలా happy feel అయ్యాడు. ఆ విశ్వాసులు ప్రభువులో స్థిరంగా ఉండాలని ప్రోత్సహించాడు. తర్వాత బర్నబా పౌలును తీసుకువచ్చాడు. ఇద్దరూ కలిసి అక్కడి సంఘానికి బోధించారు. అలా ఆ విశ్వాసులు క్రీస్తు శిష్యులుగా జీవిస్తున్న సమయంలోనే వాళ్లను మొదటిసారిగా Christians అని పిలిచారు.
ఇక్కడ ఒక విషయం గమనించారా? వాళ్లు ఏ కుటుంబంలో పుట్టారనే దాన్ని బట్టి Christians అని పిలవబడలేదు. వాళ్లు యేసుక్రీస్తు ప్రభువు గురించి విన్నారు. ఆయనను విశ్వసించారు. ఆయన వైపు తిరిగారు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం.
అయితే వాళ్లు యేసుక్రీస్తు ప్రభువు గురించి ఏం విన్నారు? అసలు వాళ్లు విశ్వసించిన సువార్త ఏంటి? దీని గురించి అపొస్తలుడైన పౌలు లో చెబుతున్నాడు. లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు ప్రభువు మన పాపాల కోసం మరణించారు. సమాధి చేయబడ్డారు. మూడవ రోజున తిరిగి లేపబడ్డారు. ఇదే సువార్తలోని ప్రధానమైన సందేశం.
కానీ ఒక ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభువు మన పాపాల కోసం ఎందుకు మరణించాల్సి వచ్చింది? ఎందుకంటే Bible ప్రకారం మనందరం పాపం చేశాం.
మన జీవితాన్ని ఒక్కసారి ఆలోచిస్తే, మనం దేవునికి విరోధంగా ఎన్నోసార్లు పాపం చేశామని అర్థమవుతుంది. నిజంగా మనం honestగా ఉంటే గనక ఈ conclusionకి మనం వస్తాం. కేవలం మనం చేసిన పనుల్లోనే కాదు. మన ఆలోచనల్లో, మాటల్లో కూడా పాపం ఉంది. దేవుడు పరిశుద్ధుడు, నీతిమంతుడు. మన పాపం వల్ల ఆయన ఎదుట మనం దోషులం. ఆయన న్యాయమైన తీర్పుకు పాత్రులం. లో పాపానికి జీతం మరణమని చదువుతాం.
మరి మనం మంచి పనులు చేస్తే మన పాపాలన్నీ పోతాయా? పోవు. మనం ఎంత మంచిగా జీవించడానికి ప్రయత్నించినా, మనం చేసిన పాపాలను మనమే తీసివేయలేం. మనకు రక్షకుడు అవసరం.
అందుకే దేవుడు తన ప్రేమను, కృపను చూపించి మన రక్షణ కోసం తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును పంపించారు. ఆయన పాపం లేని జీవితాన్ని జీవించారు. కానీ పాపుల కోసం సిలువపై మరణించారు. మూడవ రోజున తిరిగి లేచారు. ఆయన ద్వారానే మనకు పాపక్షమాపణ, దేవునితో సమాధానం, నిత్యజీవం లభిస్తాయి. అంతియొకయలో ప్రజలు విశ్వసించిన ప్రభువు ఈయనే.
అయితే ఇక్కడ ఇంకొక విషయం ఉంది. ఒక వ్యక్తికి యేసుక్రీస్తు ప్రభువు గురించి చాలా విషయాలు తెలిసి ఉండొచ్చు. ఆయన పుట్టుక గురించి, ఆయన చేసిన అద్భుతాల గురించి, ఆయన మరణం, పునరుత్థానం గురించి కూడా తెలిసి ఉండొచ్చు. కానీ ఇవన్నీ తెలిసినంత మాత్రాన ఆ వ్యక్తి నిజమైన Christian అయిపోతాడా?
ఈ విషయం అర్థం కావడానికి యోహాను సువార్త మూడో అధ్యాయంలో జరిగిన ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాం. నికోదేము అనే వ్యక్తి ఒక రాత్రి యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు వచ్చాడు. అతను ఒక పరిసయ్యుడు. యూదుల మత నాయకుల్లో ఒకడు. అంటే అతనికి ధర్మశాస్త్రం బాగా తెలుసు. దేవుని గురించి చాలా విషయాలు తెలుసు. మతపరమైన ఆచారాలు కూడా బాగా తెలుసు. కానీ అలాంటి వ్యక్తితో యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నారో తెలుసా? లో, "ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని దేవుని రాజ్యమును చూడలేడు." అని చెప్పారు.
ఒక్కసారి ఆలోచించండి. నికోదేముకు దేవుని గురించి తెలుసు. ధర్మశాస్త్రం తెలుసు. మతపరమైన విషయాల్లో అనుభవం కూడా ఉంది. అయినా అతనికి కొత్త జన్మ అవసరమని ప్రభువు చెప్పారు. అంటే మనకు దేవుని గురించి ఎంత తెలుసు అన్నది మాత్రమే ముఖ్యం కాదు. మనకు కొత్త జన్మ అవసరం.
మరి ఈ కొత్త జన్మ ఎలా వస్తుంది? అదే అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు, పరిశుద్ధాత్మ ద్వారా ఈ కొత్త జన్మ కలుగుతుందని చెబుతున్నారు. ఇది మనం మన ప్రయత్నంతో సంపాదించుకునేది కాదు. దేవుడు మనలో చేసే పని. దేవుడు మనకు కొత్త జీవాన్ని ఇస్తారు. మన పాపాన్ని గుర్తించి, క్రీస్తు అవసరాన్ని అర్థం చేసుకుని, ఆయన వైపు తిరిగేలా మన హృదయాన్ని మారుస్తారు.
అందుకే Christianగా ఉండడం అంటే కేవలం ఒక Religious Identity కాదు. మనకు దేవుని కృపచేత కొత్త జన్మ అవసరం.
మరి అలా దేవుని కృపవల్ల ఒక వ్యక్తి క్రీస్తు వైపు తిరిగినప్పుడు, అతను ఎలా స్పందిస్తాడు? యేసుక్రీస్తు ప్రభువు లో చెప్పిన మాటలు చూడండి. "మారుమనస్సు పొంది సువార్త నమ్ముడి." అంటే Repentance and Faith.
మారుమనస్సు అంటే మనం చేసిన తప్పులకు బాధపడడం మాత్రమే కాదు. మన పాపాన్ని గుర్తించి, దాని నుంచి దేవుని వైపు తిరగడం.
విశ్వాసం అంటే యేసుక్రీస్తు ప్రభువు ఉన్నారని నమ్మడం మాత్రమే కాదు. మన రక్షణ కోసం పూర్తిగా ఆయనపైనే ఆధారపడడం.
ఇది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే కొన్నిసార్లు మనం మన మంచి పనులను బట్టి, మన Christian lifeను బట్టి దేవుడు మనల్ని అంగీకరిస్తారని అనుకుంటాం. నేను Churchకి వెళ్తున్నాను. Bible చదువుతున్నాను. ప్రార్థన చేస్తున్నాను. ఇతరులకు సహాయం చేస్తున్నాను. కాబట్టి నేను దేవుని దృష్టిలో మంచివాడినే అని అనుకోవచ్చు.
కానీ లో పౌలు ఏమంటున్నాడు? మనం దేవుని కృపచేత, విశ్వాసం ద్వారా రక్షించబడ్డామని చెబుతున్నాడు. మన మంచి పనుల వల్ల కాదు. అంటే మనం ఎంత మంచి పనులు చేసినా, వాటి ద్వారా రక్షణ సంపాదించుకోలేం. మన రక్షణకు ఆధారం దేవుని కృపే. యేసుక్రీస్తు ప్రభువు చేసిన కార్యం ద్వారానే మనకు రక్షణ లభిస్తుంది.
అయితే మంచి పనులు అవసరం లేదా? తప్పకుండా అవసరమే. అదే లో మనం మంచి పనుల కోసం క్రీస్తుయేసునందు సృష్టించబడ్డామని చదువుతాం.
కానీ ఇక్కడ తేడా ఏంటంటే, మనం మంచి పనులు చేసి రక్షణ పొందం. దేవుడు మనల్ని రక్షించిన తర్వాత మన జీవితంలో మార్పు రావడం మొదలవుతుంది. మనకు ఇంకా పాపంతో పోరాటం ఉంటుంది. కానీ దేవుని వాక్యానికి లోబడాలని, క్రీస్తును అనుసరించాలని కోరుకుంటాం. అంటే మన మంచి పనులు మన రక్షణకు కారణం కాదు. దేవుడు మనలో చేస్తున్న పనికి అవి ఫలితాలు.
So, ఇప్పుడు మనం మొదట అడిగిన ప్రశ్నకు వద్దాం. అసలు Christian ఎవరు?
Christian అంటే కేవలం క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తి కాదు. Churchకి వెళ్లి, Bible గురించి బాగా తెలుసుకున్న వ్యక్తి కాదు.
నిజమైన Christian అంటే దేవుని కృపచేత, పరిశుద్ధాత్మ ద్వారా కొత్త జన్మ పొంది, తన పాపానికి మారుమనస్సు పొంది, తన రక్షణ కోసం యేసుక్రీస్తు ప్రభువుపైనే విశ్వాసం ఉంచిన వ్యక్తి. అలాంటి వ్యక్తి తన మంచి పనులను నమ్ముకోడు. తన రక్షణ కోసం యేసుక్రీస్తు ప్రభువు చేసిన కార్యంపైనే ఆధారపడతాడు. దేవుని కృపవల్ల క్రీస్తును అనుసరిస్తూ, ఆయన వాక్యానికి లోబడుతూ జీవిస్తాడు.
ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. మీ రక్షణ కోసం మీరు నిజంగా ఎవరిపై ఆధారపడుతున్నారు? మీ Religious Backgroundపైనా? మీ మంచి పనులపైనా? లేక యేసుక్రీస్తు ప్రభువుపైనేనా?
బహుశా ఇదంతా విన్న తర్వాత మీకు కూడా ఒక ప్రశ్న రావచ్చు. "మరి నేను నిజమైన Christian ఎలా కావాలి? యేసుక్రీస్తు ప్రభువును ఎలా విశ్వసించాలి?"
మీకు అలాంటి ప్రశ్నలు ఉంటే, వాటిని అలాగే వదిలేయకండి. ముందుగా దేవుని వాక్యాన్ని చదవండి. యేసుక్రీస్తు ప్రభువు ఎవరో, ఆయన మన కోసం ఏం చేశారో తెలుసుకోండి. మీ పాపాలకు మారుమనస్సు పొంది, మీ రక్షణ కోసం ఆయనపైనే విశ్వాసం ఉంచండి.
ఈ విషయాలు ఇంకా స్పష్టంగా అర్థం కాకపోతే, మీ Church Pastorతో మాట్లాడండి. లేదా క్రీస్తును నిజంగా అనుసరిస్తున్న విశ్వాసితో మాట్లాడండి. వాళ్లు Bible నుంచి ఈ విషయాలను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మీకు సహాయం చేయగలరు. ఎందుకంటే Christian అనే పేరు మనల్ని రక్షించదు. మనల్ని రక్షించేది యేసుక్రీస్తు ప్రభువే.
Thank you for listening to Life and Scripture Podcast.
Many believe that faith in Jesus guarantees wealth and success—but is that really what the Bible teaches? In this episode, we uncover the truth behind the Prosperity Gospel and its dangers