
యేసుక్రీస్తు ప్రభువు కన్యకకు జన్మించారని క్రైస్తవులు నమ్మాలా?
ఒక వ్యక్తి, "యేసుక్రీస్తు ప్రభువు నా పాపాల కోసం మరణించి, తిరిగి లేచారని నమ్ముతున్నాను. కానీ ఆయన కన్యకకు జన్మించారని నేను నమ్మను" అని చెబితే, దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలి?
కన్యక జననం క్రైస్తవ విశ్వాసంలో తప్పనిసరిగా నమ్మాల్సిన సత్యమా? లేక నమ్మినా, నమ్మకపోయినా పెద్దగా తేడా లేని విషయమా?
బైబిలు ప్రకారం, యేసుక్రీస్తు ప్రభువు కన్యకకు జన్మించారని క్రైస్తవులు నమ్మాలి. ఎందుకంటే అది దేవుని వాక్యం స్పష్టంగా వెల్లడించిన సత్యం.
అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన తేడాను గుర్తించాలి. కన్యక జననం గురించి ఒక వ్యక్తికి తెలియకపోవడం వేరు, ఆ అద్భుతం ఎలా జరిగిందో పూర్తిగా అర్థం కాకపోవడం వేరు, బైబిలు బోధిస్తున్న సత్యాన్ని తెలిసి కూడా తిరస్కరించడం వేరు.
ఈ తేడాను అర్థం చేసుకోవాలంటే, ముందుగా దేవుని వాక్యం ఏమి చెబుతుందో పరిశీలించాలి.
1. కన్యక జననం గురించి బైబిలు ఏమి బోధిస్తుంది?
లో యేసుక్రీస్తు ప్రభువు జననం గురించి స్పష్టంగా చదువుతాం.
మరియకు యోసేపుతో వివాహం నిశ్చయమైంది. అయితే వారు కలిసి కాపురం చేయకముందే ఆమె పరిశుద్ధాత్మ మూలంగా గర్భవతి అయింది. ఈ విషయం తెలిసిన యోసేపు ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలని అనుకున్నాడు. అప్పుడు ప్రభువు దూత అతనికి కలలో కనిపించి, మరియ గర్భంలో ఉన్న శిశువు పరిశుద్ధాత్మ మూలంగా కలిగాడని తెలియజేశాడు.
లో కూడా ఇదే సత్యాన్ని చూస్తాం. గబ్రియేలు దూత మరియకు కుమారుడు జన్మిస్తాడని చెప్పినప్పుడు, ఆమె పురుషుని ఎరుగని కన్యకగా ఇది ఎలా జరుగుతుందని ప్రశ్నించింది. అందుకు దేవదూత, పరిశుద్ధాత్మ ఆమె మీదికి వస్తాడని, మహోన్నతుని శక్తి ఆమెను కమ్ముకుంటుందని తెలియజేశాడు.
మత్తయి ఈ సంఘటనను లోని ఇమ్మానుయేలు ప్రవచనానికి నెరవేర్పుగా చూపిస్తున్నాడు ().
ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, మత్తయి, లూకా ఇద్దరూ కన్యక జననాన్ని కేవలం ఒక ఉపమానంగా లేదా ఆధ్యాత్మిక భావంగా చెప్పడం లేదు. నిజంగా జరిగిన సంఘటనగా తెలియజేస్తున్నారు.
అందువల్ల కన్యక జననం అనేది క్రైస్తవులు తరువాత కల్పించుకున్న సంప్రదాయం కాదు. అది దేవుని వాక్యంలో వెల్లడించబడిన సత్యం.
2. కన్యక జననం ఎందుకు అంత ముఖ్యమైనది?
దీనికి సమాధానం తెలుసుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభువు ఎవరో అర్థం చేసుకోవాలి.
లో వాక్యము ఆదియందే ఉన్నాడని, ఆ వాక్యము దేవుడై ఉన్నాడని చదువుతాం. 14వ వచనంలో ఆ వాక్యము శరీరధారియై మన మధ్య నివసించాడని చెప్పబడింది.
అంటే యేసుక్రీస్తు ప్రభువు మరియ గర్భంలో ఏర్పడినప్పుడే తన ఉనికిని ప్రారంభించలేదు. ఆయన నిత్యుడైన దేవుని కుమారుడు.
ఆయన మొదట ఒక సాధారణ మానవుడిగా జన్మించి, తరువాత దేవుడిగా మారలేదు. నిత్యుడైన దేవుని కుమారుడే నిజమైన మానవ స్వభావాన్ని స్వీకరించి ఈ లోకానికి వచ్చారు.


