
నేను పని చేస్తున్న కంపెనీ వారు మార్కెటింగ్ చేయడానికి కొన్ని సమావేశాలకి వెళ్తూ ఉంటారు. వారు తిరిగివచ్చినపుడు తమతో వారికి ఇచ్చిన మార్కెటింగ్ వస్తువులను తీసుకొని వస్తారు. ఒకసారి ఆలా తీసుకొని వచ్చిన వాటి నుండి మాకు నచ్చినవి తీసుకోమన్నారు. నా ద్రుష్టి ఒక మెరిసే వస్తువు పయిన పడింది. కొద్దీ కాలంగా నేను ఏ షాప్ కి వెళ్లినా ఇది చూస్తున్నాను . దానిని ఫైడ్జెట్ స్పిన్నర్ అంటారు. ఇది ఒక చిన్న బొమ్మ పరికరం. నేను దానిని పట్టుకొని అది ఎలా పనిచేస్తుందో అని చూస్తున్నపుడు నా మేనేజర్ , "నువ్వు ఒత్తిడి లో ఉన్నావా అది తీసుకున్నావు" అన్నారు. నేను అయోమయంతో లేదు అన్నాను. అప్పుడు ఆమె "ఇది ఒత్తిడి లో ఉన్న వారు, ఉపశమనం కోసం వాడుతారు" అని అన్నారు. కొద్ది సేపు అయ్యాక నేను నా డెస్క్ దెగ్గరకు వెళ్ళాక దీనిని గురించి చదివాను. వికీపీడియాలో," సమస్యలతో సతమతమయ్యేవారికి మానసిక ఒత్తిడి ఉన్నవారికి ఉపయోగించుకొనుటకు దీనిని కనుకొన్నారని , ఆందోళన లో ఉన్న వారిని నెమ్మదిపరచుటకు , ఇతర నాడీ సంభందితలోపములు అనగా ADHD ,ఆటిజం తో బాధపడుతున్నవారికి ఇది సహాయపడుతుందని, అయితే ఇంతవరకు ఈ పరికరం ఆటిజం లేదా ADHD చికిత్సకు ప్రభావితము చేస్తుందని ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు." అని పేర్కొన్నారు. నేను దాని గురించి చదివేటప్పుడు, బాగా తెలిసిన వాక్యభాగం నాకు గుర్తొచింది . అది వచనాలు ,"దేనినిగూర్చియు చింతపడకుడి గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనములచేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. 7 అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తువలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి యుండును."
అయితే ఈ ఆందోళన ఎలాగా ఉంటుంది?
పరిస్థితులన్ని మనకి అనుకూలంగా ఉంటే మనం సంతోషిస్తాం, అలాగ జరగనప్పుడు మనం అధైర్యపడతాం, ఆందోళనకి గురవుతాం . దేనినైనా ఆశించి అది పొందలేకపోతానేమో అన్న భయం దానికి తోడైతే వచ్చేదే ఆందోళన లేక చింత అని జాన్ పైపర్ అన్నారు. నేను ఎవరిని పెళ్లి చేసుకుంటానో,ఉద్యోగం ఎక్కడ వస్తుందో. అసలు వస్తుందో రాదో, పరీక్షలు పాస్ అవుతానో లేదా? నాకు జీవితంలో విజయం వస్తుందో రాదో ,నాకు జబ్బు నయమౌతుందో లేదో ఇవన్నీ ఆందోళనకు ఉదాహరణాలు. రాబోవు జీవితం గురించి ఘోరంగా ఉహించుకొని ఎప్పుడు దానిగురించే ఆలోచిస్తూఉండడం చింతకు గుర్తులు.
చింతించడం పాపం అని గ్రహించడం ఆందోళనను అధిగమించడానికి మొదటి మెట్టు
ఆందోళన(చింత )నీ జీవితంలో ఎలాంటి దుష్ప్రభావాలు తెస్తుంది ?
1. ఈ ఆందోళనతో నీవు కృంగిపోతావు(). లోకాములో ఉన్న సమస్యలన్నీ నీ భుజముపై ఉన్నట్లు అనిపిస్తుంది.
2. దేనిమీద ద్యాసం ఉండదు. విసుకు వస్తుంది , అది మన ఆత్మీయుల మీద చుపిస్తావు.
3. శాంతి సమాధానాలకు దూరం చేస్తుంది.
4. దేవుని వాగ్దానాలను మర్చిపోయేలా చేస్తుంది.
5. దేవుని తో సహవాసాన్ని కోల్పోతావు.


