
క్రొత్తగా తిరిగి జన్మించబడడం: నిజమైన మార్పునకు పునాది
క్రొత్తగా తిరిగి జన్మించబడడం అనేది క్రైస్తవ జీవితానికి మూల రాయి. ఇది విశ్వాసి యొక్క స్వభావ మార్పును, పవిత్రతను, మరియు దేవునికి విధేయతను సూచిస్తుంది.
క్రొత్తగా తిరిగి జన్మించబడడం: నిజమైన మార్పునకు పునాది
క్రైస్తవ జీవితం అనేది దేవుని యొక్క అద్భుతమైన కార్యంతో ప్రారంభమవుతుంది. ఆ గొప్ప కార్యం ఏమనగా పరిశుద్ధాత్మ ద్వారా తిరిగి జన్మించబడడం.
“మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు, నిర్మలమైనదియు, వాడ బారనిదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు, ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరల జన్మింపజేసెను”.
"క్రొత్తగా తిరిగి జన్మించడం" అనగా నైతికమైన అభివృద్ధి లేదా వ్యక్తిగత సంకల్పం గురించి కాదు. ఒక పాపిని క్రీస్తులో నూతన సృష్టిగా రూపాంతరం చెందించే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఒక అసాధారణమైన పని (). నూతనంగా తిరిగి జన్మించడం అనేది ఒక దైవశాస్త్రమునకు సంబంధించిన అంశము కాదు. ఇది ప్రతి ఒక్క విశ్వాసి యొక్క వ్యక్తిగత ఎదుగుదల మరియు పరిశుద్ధతకు ఒక పునాది.
క్రొత్తగా తిరిగి జన్మించబడడం అనగా ఏమిటి? (What is Regeneration?)
రీజనరేషన్ అనగా క్రొత్తగా తిరిగి జన్మించడం. ఇది దేవుడు చేసే క్రియ. ఈ క్రియలో తన పాపముల చేత తన ఆత్మీయ స్థితిలో చచ్చిన స్థితిలో ఉన్న ఒక వ్యక్తి యొక్క జీవితం లోనికి ఒక ఆత్మీయమైన జీవాన్ని దేవుడు ఇస్తాడు (). ఇది రక్షణ శాస్త్రములో కీలకమైన అంశం. ఇది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మానవుని యొక్క అంతరంగములో జరిగేటువంటి పని.
ఇది కేవలం భౌతికమైన లేదా స్వాభావికమైన మార్పు మాత్రమే కాదు ఇది ఒక మానవుని యొక్క అంతరాత్మను పరిపూర్ణంగా పునరుద్ధీకరిస్తుంది. ప్రభువైన ఏసుక్రీస్తు నికోదేముతో చేసిన సంభాషణలో ఈ క్రియ ని "క్రొత్తగా జన్మించడం" అని సంబోధించాడు.
అందుకు యేసు అతనితో, "ఒకడు క్రొత్తగా జన్మించితేనే కాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను".
దైవశాస్త్రపరంగా చూస్తే కొత్తగా జన్మించడం అనేది నీతిమంతులుగా తీర్చబడడం, దత్తపుత్రులవ్వడం, మరియు పవిత్రీకరించబడడం అనే అంశాలకి వేరైనప్పటికీ, వీటన్నిటి నుండి ఏమాత్రం విడదీయని బంధాన్ని కలిగి ఉంది.
కొత్తగా జన్మించడంలో పరిశుద్ధాత్ముని యొక్క కార్యము
కొత్తగా జన్మించడం అనేది పూర్తిగా దేవుని యొక్క కార్యము.
"మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయుట ద్వారాను మనలను రక్షించెను".
కొత్తగా జన్మించబడడం అనేది మానవుని కృషి ఫలితం, నిర్ణయాలు లేదా యోగ్యత వల్ల కాదు అని ఈ సత్యము తేటగా సెలవిస్తుంది. ఇది పరిశుద్ధాత్ముని యొక్క సార్వభౌమ కార్యము, పరిశుద్ధాత్ముడు ప్రభువైన ఏసుక్రీస్తు వారి యొక్క రక్షణ కార్యమును వ్యక్తిగతంగా అన్వహించి మరణము నుంచి జీవములోనికి నడిపిస్తాడు.


