
సృష్టి సిద్ధాంతం · Ep. 2వేదాంతం
సృష్టికి ముందు దేవుడు
సృష్టికి ముందు దేవుడు ఉన్నాడా? దేవునికి కూడా ఒక ప్రారంభం ఉందా? అసలు దేవుణ్ణి ఎవరు సృష్టించారు?
Hosted by Isaac
· 8 min

Show notes
సృష్టికి ముందు దేవుడు
సృష్టికి ముందు దేవుడు ఉన్నాడా? దేవునికి కూడా ఒక ప్రారంభం ఉందా? అసలు దేవుణ్ణి ఎవరు సృష్టించారు?
సృష్టి సిద్ధాంతం (Doctrine of Creation) సిరీస్‌లోని ఈ రెండవ ఎపిసోడ్లో, సృష్టికి ముందే ఉన్న దేవుని గురించి బైబిలు ఏమి బోధిస్తుందో దేవుని వాక్యం ఆధారంగా పరిశీలిస్తాం.
ఈ ఎపిసోడ్లో తెలుసుకునే విషయాలు
- సృష్టికి ఒక ప్రారంభం ఉంది. కానీ సృష్టికర్తకు ప్రారంభం లేదు. ఆయనకు ఆదియు లేదు, అంతమూ లేదు (Eternity of God).
- దేవుడు కాలానికి అతీతుడు. అయినా చరిత్రలో తన సంకల్పాన్ని నెరవేరుస్తున్నారు.
- సమస్తం దేవునిపై ఆధారపడి ఉంది. కానీ దేవుడు దేనిపైనా ఆధారపడరు (God's Self-Existence, Aseity).
- దేవుడు మార్పులేనివాడు. ఆయన స్వభావం, పరిశుద్ధత, జ్ఞానం, శక్తి ఎప్పుడూ మారవు (Immutability of God).
- సృష్టికి ముందే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ఉన్నారు. దేవుడు ఒంటరిగా ఉన్నందుకో, తనకు ఏదో అవసరమై ఈ ప్రపంచాన్ని సృష్టించలేదు.
ముఖ్యమైన బైబిలు వాక్యభాగాలు
— యుగయుగములు నీవే దేవుడవు.
— ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను.
— కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపారు.
— నేను ఉన్నవాడను అను వాడనై యున్నాను.
అపొస్తలుల — అందరికీ జీవాన్ని, ఊపిరిని, సమస్తాన్ని ఇచ్చేది ఆయనే.
— ఆయన సంవత్సరాలకు అంతం లేదు.
— యెహోవానైన నేను మార్పులేనివాడను.
; 17:5, 24 — సృష్టికి ముందే ఉన్న వాక్యము, తండ్రి దగ్గర ఉన్న మహిమ, ప్రేమ.
— సమస్తం ఆయన మూలంగా, ఆయన ద్వారా, ఆయన కోసమే ఉన్నాయి.
ఆలోచించండి
నా దేవుడు నిత్యుడు, మార్పులేనివాడు. అయితే మారుతున్న నా పరిస్థితుల్లో నేను ఆయనపై ఎంతవరకు ఆధారపడుతున్నాను?



