
క్రైస్తవ జీవితానికి పునాదులు · Ep. 2వేదాంతం
Theology అంటే ఏంటి?
మనం దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్తాం. కానీ మనం నమ్ముతున్న దేవుని గురించి మనకు ఎంత తెలుసు? Theology కేవలం పాస్టర్లకేనా, లేక ప్రతి క్రైస్తవుడికీ అవసరమా?
Hosted by Isaac
· 8 min

Show notes
Theology అంటే ఏంటి?
మనం దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్తాం. కానీ మనం నమ్ముతున్న దేవుని గురించి మనకు ఎంత తెలుసు? దేవుని గురించి తెలుసుకోవడం కేవలం పాస్టర్లకు, Bible Collegeలో చదివేవాళ్లకు మాత్రమే అవసరమా? క్రైస్తవ జీవితానికి పునాదులు సిరీస్‌లోని ఈ రెండవ ఎపిసోడ్లో Theology అంటే ఏంటి, దాన్ని ఎందుకు నేర్చుకోవాలి, మన క్రైస్తవ జీవితానికి అది ఎందుకు ముఖ్యమో Bible ఆధారంగా చూస్తాం.
ఈ ఎపిసోడ్లో:
- Theology అంటే ఏంటి? దేవుడు ఎవరు, ఆయన ఏం చేశారు, మన గురించి ఆయన ఏం చెప్తున్నారో Bible ఆధారంగా తెలుసుకోవడం
- దేవుని పరిశుద్ధత, ప్రేమ, శక్తి, పాపం, రక్షణ: Theology సమాధానం వెదికే ప్రశ్నలు
- Theology ఉద్దేశం సమాచారం కాదు: దేవుణ్ణి సరిగ్గా తెలుసుకోవడం, ఆయనను ప్రేమించడం, ఆయనకు విధేయులుగా జీవించడం
- పూర్ణహృదయంతో దేవుణ్ణి ప్రేమించమనే మొదటి ఆజ్ఞ, మనకు తెలియని దేవుణ్ణి ఎలా ప్రేమించగలం?
- కీర్తనల్లో దేవుని కోసం దాహం: దేవుని నుండి ఏదో కాదు, దేవుణ్ణే కోరుకోవడం
- మనం దేవుని గురించి నమ్మేది మన రోజువారీ జీవితాన్ని ఎలా మారుస్తుంది?
- దేవుని గురించి సమాచారం ఉండడం వేరు, దేవుణ్ణి వ్యక్తిగతంగా ఎరుగడం వేరు
- Theology పాస్టర్లకు మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడికి అవసరం
లేఖన భాగాలు: · · · · ·
అధ్యాయాలు: 0:00 దేవుని గురించి మనకు ఎంత తెలుసు? 0:33 గత ఎపిసోడ్: క్రైస్తవుడు ఎవరు? 1:01 Theology అంటే ఏంటి? 1:19 Theology అడిగే ప్రశ్నలు 1:50 Theology ఉద్దేశం 2:06 మొదటి ఆజ్ఞ: , 2:49 తెలియని దేవుణ్ణి ఎలా ప్రేమించగలం? 3:08 దేవుణ్ణి తెలుసుకోవాలనే కోరిక: కీర్తనలు 63, 42, 73 4:33 Theology, మన రోజువారీ జీవితం 6:05 సమాచారం వేరు, దేవుణ్ణి ఎరుగడం వేరు: 7:07 Theology ప్రతి క్రైస్తవుడికి 7:36 మీకు ఒక ప్రశ్న
ఆలోచించండి: నేను దేవుని నుండి ఏం పొందగలను అని మాత్రమే ఆలోచిస్తున్నానా? లేక దేవుడు ఎవరో తెలుసుకోవాలని కూడా నిజంగా కోరుకుంటున్నానా?
ఈ విషయాలు ఇంకా స్పష్టంగా అర్థం కాకపోతే, మీ Church Pastorతో గానీ, క్రీస్తును నిజంగా అనుసరిస్తున్న విశ్వాసితో గానీ మాట్లాడండి.
మరిన్ని ఎపిసోడ్ల కోసం Life and Scripture app (iPhone, Android) లేదా lifeandscripture.com చూడండి.
Read the transcript+
మనం దేవుని నమ్ముతున్నామని చెప్తాము. కానీ మనం నమ్ముతున్న దేవుని గురించి మనకి ఎంతవరకు తెలుసు? దేవుడు ఎలాంటి వ్యక్తి? ఆయన స్వభావం ఏంటి? ఆయన గురించి బైబిల్ ఏం చెప్తుంది? ఈ విషయాలు తెలుసుకోవడం కేవలం పాస్టర్లకు, బైబిల్ కాలేజీలో చదివే వాళ్ళకు మాత్రమే అవసరమా? లేక ప్రతి క్రైస్తవుడికి తెలుసుకోవలసిన విషయాలా? Welcome to Life on Scripture Podcast. ఈ రోజు థియాలజీ అంటే ఏంటి? దాన్ని ఎందుకు నేర్చుకోవాలి? మన క్రైస్తవ జీవితానికి అది ఎందుకు ముఖ్యమో చూద్దాం. గత ఎపిసోడ్ లో క్రైస్తవులు ఎవరు అనే విషయాన్ని చూశాం. క్రైస్తవ కుటుంబంలో పుట్టడం వల్లనో, చర్చ్ కి వెళ్ళడం వల్లనో మనం క్రైస్తవులు అయిపోంగాని, పాపం నుండి పశ్చాత్తాపపడి, యేసు క్రీస్తు ప్రభువును విశ్వసించడం ద్వారానే మనకి రక్షణ కలుగుతుందని చూశాం. మనం క్రైస్తవుడిగా మారిన తర్వాత మనం ఏం చేయాలి? మనల్ని రక్షించిన దేవుని మరింతగా తెలుసుకోవాలి. అందుకే థియాలజీ గురించి మాట్లాడుకోవడం చాలా అవసరం. ముందుగా థియాలజీ అంటే ఏంటో చూద్దాం. సింపుల్ గా చెప్పాలంటే, థియాలజీ అంటే దేవుని గురించి అధ్యయనం చేయడం. దేవుడు ఎవరు, ఆయన స్వభావం ఎలాంటిది, ఆయన ఏం చేశారు, మన గురించి ఆయన ఏం చెప్తున్నారు అనే విషయాలను బైబిల్ ఆధారంగా తెలుసుకోవడమే థియాలజీ. ఉదాహరణకు, దేవుడు పరిశుద్ధుడు అని మనం చెప్తాం. కానీ ఆయన పరిశుద్ధత అంటే ఏంటి? దేవుడు ప్రేమగలవాడు అని చెప్తాం. ఆయన ప్రేమ ఎలాంటిది? దేవుడు సర్వశక్తిమంతుడు అంటే ఏంటి? ఆయన ఎందుకు మనల్ని సృష్టించారు? పాపం అంటే ఏంటి? యేసు క్రీస్తు ప్రభువు మన రక్షణ కోసం ఎందుకు మరణించి తిరిగి లేచారు? ఇలాంటి ప్రశ్నల గురించి బైబిల్ నుండి సమాధానాలు తెలుసుకోవడమే థియాలజీలో ఒక భాగం. కానీ ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. థియాలజీ ఉద్దేశ్యం కేవలం దేవుని గురించి సమాచారం సంపాదించడం మాత్రమే కాదు. దేవుని సరిగ్గా తెలుసుకోవడం, ఆయనను ప్రేమించడం, ఆయనకు విధేయులుగా జీవించడం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయం 5వ వచనంలో మోషే ఇశ్రాయేలులకు ఒక ముఖ్యమైన ఆజ్ఞ ఇస్తున్నాడు. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. మత్తేయి సువార్త 22వ అధ్యాయం 37, 38 వచనాలలో చూస్తే, యేసు క్రీస్తు ప్రభువు ఇదే ఆజ్ఞను గొప్పదైన మొదటి ఆజ్ఞగా చెప్తాడు. ఇక్కడ దేవుని ప్రేమించడం అంటే కేవలం ఆయన పట్ల మంచి ఫీలింగ్స్ కలిగి ఉండడం కాదు. ఆయన ఆలోచనలు, మన కోరికలు, మన నిర్ణయాలు, మన శక్తి, ఇలా మన జీవితం మొత్తంతో ఆయనను ప్రేమించాలి. మరి మనకు తెలియని దేవుని గురించి మనం ఎలా ప్రేమించగలం? ఆయన స్వభావాన్ని తెలుసుకోకుండా, ఆయన ఇష్టమైనది ఏంటో తెలుసుకోకుండా మనం ఆయనకు విధేయులుగా ఎలా జీవించగలం? అందుకే దేవుని గురించి తెలుసుకోవడం క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన సంగతి. అయితే దేవుని తెలుసుకోవాలనే కోరిక ఎలా ఉండాలి? దీనికి కీర్తన గ్రంథంలో మనకి ఒక మంచి ఉదాహరణ కనిపిస్తాయి. ఉదాహరణకి కీర్తన 63వ అధ్యాయంలో దావీదు యూదా అరణ్యంలో ఉన్నప్పుడు తనకు దేవుని పట్ల ఉన్న కోరికను తెలేజేస్తున్నాడు. ఒకసారి ఆ పరిశుద్ధిని గుర్తుచుకుందాం. చుట్టూ ఎండిపోయిన భూమి, నీళ్ళు లేని ప్రాంతం, కష్టమైన ప్రదేశం. అలాంటి ప్రదేశంలో దాహంతో ఉన్న వ్యక్తి నీళ్ళ కోసం ఎంతగా ఎదురుచూస్తాడో మనకు తెలుసు. దావీదు మొదటి వచనంలో తన ప్రాణం దేవుని కోసం దాహం గొంటుందని చెప్తున్నాడు. దావీదు కేవలం దేవుని నుండి ఏదైనా పొందాలని కోరడం లేదు. దేవున్నే కోరుకుంటున్నాడు. అలాగే ఇంకొక ఉదాహరణ చూస్తే, కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 2వ వచనంలో కీర్తనకారుడు జీవముగల దేవుని కోసం తన ప్రాణం దాహం గొంటుందని చెప్తున్నాడు. అలాగే వచనాలలో కూడా ఇదే కోరిక మనకు కనిపిస్తుంది. భూమిదా దేవుడు తప్ప మనకు మరేది ప్రధానమైనది కాదని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఈ మూడు కీర్తనలలో మనకు కనిపించేది ఒకటే. దేవుని నిజంగా తెలుసుకున్నవారు ఆయనను మరింతగా కోరుకుంటారు. మరి ఈ థియాలజీ మన రోజువారీ జీవితాలతో ఎలా సంబంధించింది? దానికి దీనికి రిలేషన్ ఏంటి అని మనం ఆలోచిస్తే, మనం దేవుని గురించి ఏం నమ్ముతున్నామో అది మన జీవితానికి ప్రభావం చూపుతుంది. అది మన లైఫ్ ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎవ్రీ డే. ఉదాహరణకు, దేవుడు సార్వభౌముడు అని బైబిల్ నుండి మనం తెలుసుకున్నప్పుడు, మన పరిశుద్ధతలన్నీ ఆయన అధీనంలో ఉన్నాయని అర్థం చేసుకుంటాం. దేవుడు పరిశుద్ధుడు అని తెలుసుకున్నప్పుడు, పాపాన్ని మనం తేలికగా తీసుకోవడం మానేస్తాం. అలాగే, కృపగలవాడు అని తెలుసుకున్నప్పుడు, మన రక్షణ మన మంచితనం మీద కాకుండా యేసు క్రీస్తు ప్రభువు చేసిన కార్యం మీదనే ఆధారపడి ఉందని అర్థం చేసుకుంటాం. ఆయనను మనం ప్లీజ్ చేయాలని చూస్తాం. దీని బట్టి, ఆయనకు విధేయులుగా ఉండడం బట్టి, ఆయన మనకు ఇచ్చిన విశ్వాసాన్ని బట్టి, ఆయన మనల్ని ఎన్నుకున్న విధానం బట్టి దేవునికి మనం థ్యాంక్‌ఫుల్ గా ఉంటాం. కానీ మన పర్ఫార్మెన్స్ బట్టి మనం ఆయన్ని ప్లీజ్ చేయలేము. అలాగే మన పర్ఫార్మెన్స్ బట్టి కానీ, మన మంచి కార్యాల బట్టి కానీ ఆయన మనల్ని ఎన్నుకోలేదు. అలాగే, దేవుడు నమ్మదగినవాడు అని మనం తెలుసుకున్నప్పుడు, కష్టాలు వచ్చినా ఆయన వాగ్దానాలను విశ్వసించడానికి మనకు సహాయపడుతుంది. అంటే మనం దేవుని గురించి తెలుసుకునే ప్రతి సత్యం మన ఆలోచనలను, మన డిసిషన్స్ ను, మన జీవన విధానాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అయితే ఇంకొక విషయం కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఒక వ్యక్తికి బైబిల్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉండచ్చు. చాలా వచనాలు బాగా బట్టి గొట్టే ఉండచ్చు. థియాలజీ గురించి గంటల తరబడి మాట్లాడే ఎబిలిటీ ఉండచ్చు. కానీ సమాచారం ఉండడమే దేవునితో నిజమైన సంబంధం ఉందని చెప్పడానికి ఆధారం కాదు. యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో యేసు క్రీస్తు ప్రభువు నిత్య జీవం గురించి మాట్లాడుతూ, అద్వితీయ సత్య దేవుని, ఆయన పంపిన యేసు క్రీస్తును ఎరగడమే నిత్య జీవమని చెప్తున్నారు. కాబట్టి దేవుని గురించి తెలుసుకోవడం, ఆయనను వ్యక్తిగతంగా విశ్వసించి తెలుసుకోవడం రెండు వేరే వేరే విషయాలు. అదే సమయంలో దేవున్ని నిజంగా ప్రేమిస్తున్నానని చెప్తూ, ఆయన గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపించకుండా ఉండడం అనేది సరైన విషయం కాదు. మన విశ్వాసం దేవుని వాక్యంలోని సత్యంపై ఆధారపడి ఉండాలి. అందుకే థియాలజీ అనేది కేవలం పాస్టర్ల కోసమో ఉన్న ఒక అకడమిక్ కోర్స్ కాదు. ప్రతి క్రైస్తవుడికి అవసరమైన అధ్యయనం. మనం థియాలజీ నేర్చుకునేది ఇతరులతో వాదించడానికో, లేదా మనకు ఎక్కువ తెలుసు అని చూపించుకోవడానికో కాదు. దేవున్ని, ఆయన వాక్యం ద్వారా మరింత సరిగ్గా తెలుసుకోవడానికి, ఆయనను ప్రేమించడానికి, ఆయనకు విధేయులుగా జీవించడానికి. కాబట్టి ఈ రోజు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. నేను దేవుని నుండి ఏం పొందగలను అని మాత్రమే ఆలోచిస్తున్నావా? లేక దేవుడు ఎవరో తెలుసుకోవాలని కూడా నిజంగా కోరుకుంటున్నావా? ఎందుకంటే క్రైస్తవ జీవితంలో మనం సంపాదించుకోగలిగే గొప్ప జ్ఞానం దేవుని గురించిన జ్ఞానమే. దేవుని గురించి మన అవగాహన పెరిగే కొద్దీ, ఆయనను మరింతగా ప్రేమించడానికి, ఆయనను విశ్వసించడానికి, ఆయనకు విధేయులుగా జీవించడానికి మనం ఎదగాలి. ఇదే థియాలజీ నేర్చుకోవడంలో ఒక ముఖ్యమైన ఉద్దేశ్యం.



